శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 19:30:24

గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ

గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ

ఖమ్మం :  రాష్ట్రంలో గ్రామగ్రామాన వైకుంఠ ధామాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలెంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని చెప్పారు.

పల్లె ప్రకృతి వానలు, వైకుంఠధామం నిర్మాణం, ఇంటింటికి తాగునీరు, పారిశుధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల అమలు ద్వారా పల్లెలను నందనవనాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. గ్రామాల్లో అన్నివసతులు కల్పించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo