గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 12:04:08

వ్య‌వ‌సాయాన్ని పండుగ‌‌గా మార్చాం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ్య‌వ‌సాయాన్ని పండుగ‌‌గా మార్చాం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ రూర‌ల్‌: రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల పండుగ‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. బ‌తుక‌మ్మ‌, రంజాన్‌, క్రిస్‌మ‌స్ పండుగ‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌కు బట్ట‌లు అందించిన సంద‌ర్భాలు చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేవ‌ని చెప్పారు. జిల్లాలోని రాయ‌ప‌ర్తి మండ‌ల కేంద్రంలో మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ త‌న పరిపాల‌నాద‌క్ష‌త‌తో రాష్ట్రంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేశార‌న్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత క‌రెంటు, సాగునీరు అందిస్తూ వ్య‌వ‌సాయాన్ని పండువ‌గా మార్చార‌ని చెప్పారు. 

ప్ర‌భుత్వం 2017లో బ‌తుక‌మ్మ‌ను రాష్ట్ర‌పండుగ‌గా ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. అప్ప‌టినుంచి దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న, 18 ఏండ్లు నిండిన మ‌హిళ‌కు చీర‌లు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ప్ర‌తి ఏడాది 1.2 కోట్ల‌ మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు అందిస్తున్నామ‌ని, రాష్ట్రంలో 20,36,234 కుటుంబాల‌కు బ‌తుక‌మ్మ చీరలు అందుతున్నా‌య‌ని చెప్పారు. చీర‌ల కోసం గ‌తేడాది రూ.313 కోట్లు, ఈ ఏడాది రూ.317 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. గ‌త ఏడాది 110 ర‌కాల రంగుల చీర‌లు అందించ‌గా, ఈసారి 287 ర‌కాల చీర‌లు ఇస్తున్నామ‌న్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 13 ల‌క్ష‌ల 23 వేల చీర‌లు, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 1,04,745 చీర‌ల‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo