బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 17:52:39

రైతువేదికల నిర్మాణంతో రైతులకు మరింత గౌరవం

రైతువేదికల నిర్మాణంతో రైతులకు మరింత గౌరవం

కుమ్రం భీం ఆసిఫాబాద్ : రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 

రైతుల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు వేదికలను ప్రత్యేకంగా నిర్మించిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలు కేవలం తెలంగాణలోనే అమల్లో ఉన్నాయన్నారు. రైతు వేదికల నిర్మాణాలతో రైతులకు మరింత గౌరవం పెరిగిందన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.