శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:55:28

ప్రభుత్వ చర్యలు భేష్‌: అడ్వకేట్‌ జేఏసీ

ప్రభుత్వ చర్యలు భేష్‌: అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొన్న చొరవ ప్రశంసనీయమని అడ్వకేట్‌ జేఏసీ పేర్కొన్నది. వైరస్‌ బయటపడ్డ వెంటనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, ప్రజలను అప్రమత్తంచేయడం ద్వారా సమర్థంగా వ్యవహరించిందని జేఏసీ నేతలు కొంతం గోవర్ధన్‌రెడ్డి, తూడి శ్రీధర్‌రావు, తిరుమల్‌రావు, చక్రధర్‌రెడ్డి, శ్యాంకుమార్‌, జే శ్రీనివాస్‌రెడ్డి, దుర్గానందం అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ.. గాంధీ దవాఖానలో ఐసొలేటెడ్‌ వార్డును ఏర్పాటుచేయడం, సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లను విడుదల చేయడం ప్రభుత్వ  చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో వైరస్‌ ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు. logo