బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 06:58:27

ఊరంతా బాగుండాలని.. స్వయంగా పిచికారీ చేసిన మహిళా సర్పంచ్

ఊరంతా బాగుండాలని.. స్వయంగా పిచికారీ చేసిన మహిళా సర్పంచ్

ప్రతి గ్రామంలో సర్పంచ్‌లే కథానాయకులు కావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం గోపతండా సర్పంచ్‌ అజ్మీరా లక్ష్మి నడుం బిగించారు. శుక్రవారం పంపును భుజానికేసుకొని తండాలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్వయంగా పిచికారీ చేశారు. నిత్యం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. సర్పంచ్‌ చొరవను తండావాసులు అభినందిస్తున్నారు.  

నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ గోపతండాకు అజ్మీర లక్ష్మి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైయింది. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నది. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు కంచె ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్‌ నడుపుకుంటూ మొక్కలకు నీరు అందించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణ కోసం ప్రభుత్వం గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా సర్పంచ్‌లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. ప్రతి గ్రామంలో సర్పంచ్‌లే కథానాయకులు కావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు గ్రామాన్ని శుభ్రం చేయడంతో పాటు సర్పంచ్‌ లక్ష్మి తానే తైవాన్‌ పంపు వేసుకొని తండాలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నది. ప్రతి రోజూ తండాలో ఎక్కువ మంది జనం ఉండే ప్రాంతంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నది. గ్రామ ప్రజల రక్షణకు అన్నితానై వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్‌ లక్ష్మిని పలువురు అభినందిస్తున్నారు.


logo