సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 09:29:48

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడుత కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను గూగుల్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్ స్వీక‌రించారు. మోకిలాలోని తన నివాసంలో 14 మొక్కలు నాటి తన లింక్ డిన్ (LINK DIN) ఖాతాలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అరిజిత్ స‌ర్కార్ పంచుకున్నారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స‌ర్కార్ స్ప‌ష్టం చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలియజేశారు. అరిజిత్ స‌ర్కార్ మరో ముగ్గురికి.. మాధురి దుగ్గిరాల సీనియర్ డైరెక్టర్ గూగుల్, రాహుల్ జిందాల్ డైరెక్టర్, హీనా రావల్ డైరెక్టర్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాల‌ని సూచించారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి ఈ కార్య‌క్ర‌మాన్ని కొనసాగించాలని స‌ర్కార్ పిలుపునిచ్చారు.


logo