ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Nov 30, 2020 , 17:57:52

‘కన్నుల పండువగా గూడెం జాతర’

‘కన్నుల పండువగా గూడెం జాతర’

మంచిర్యాల : తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచి జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు కరీంనగర్‌, వరంగర్‌, నిజమాబాద్‌ జిల్లాల నుంచి సుమారు 70వేల మందికి హాజరయ్యారు. 

వేలాదిగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. గుట్టపై ఉన్న ధ్వజస్తంభం వద్ద, గుట్ట కింద గల రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. గూడెం గోదావరి వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలి.. గంగమ్మతల్లికి పూజలు చేశారు. 

VIDEOS

logo