సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 15:10:39

కోవిడ్‌-19పై త్వ‌ర‌లోనే మంచి ఫ‌లితం : సీఎస్ రంగరాజన్

కోవిడ్‌-19పై త్వ‌ర‌లోనే మంచి ఫ‌లితం : సీఎస్ రంగరాజన్

హైద‌రాబాద్ : భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు, డాక్టర్లు, ప్రభుత్వ ప్రయత్నాలు అన్నింటికీ తొందరలోనే మంచి ఫలితం లభిస్తుంద‌ని చిలుకూరి బాలాజీ పూజారి సీఎస్ రంగ‌రాజ‌న్ అన్నారు. చిలుకూరు బాలాజీ ఆల‌యంలో నేడు అద్భుత దృశ్యం ఆవిషృత‌మైంది. ఇది కోవిడ్‌-19పై శుభ‌వార్త‌కి సంకేతంగా పూజారులు పేర్కొన్నారు. ఇవాళ తెల్లవారుజామున చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల గ‌ల శివాలయంలో ఓ తాబేలు(కురుమూర్తి) ఎక్కడి నుంచో ప్రవేశించింది. ఎటువంటి ప్రాణీ ప్ర‌వేశించ‌డానికి వీలులేని ఆల‌యంలోకి దాదాపు 10 సెంటీమీటర్ల‌ పొడవు 6 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉంద‌ని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం అన్నారు. 

ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుంద‌న్నారు. పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనే సర్పంతో ఒకవైపు దేవతలు మ‌రొవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్‌-19ని జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నది. సాగర మథనంలో హాలాహలం వచ్చింది దానిని పరమశివుడు మింగాడు. అలాగే ఇవాళ చిలుకూరులో సుందరేశ్వరస్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వరస్వామి మనకు త్వరలోనే లోకం నుండి ఈ వైరస్ అంతామ‌య్యేలా చేస్తాడ‌ని అన్నారు. 


logo