బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 02:45:06

ఆర్టీసీ కార్గోకు అద్భుత ఆదరణ

ఆర్టీసీ కార్గోకు అద్భుత ఆదరణ

సుల్తాన్‌బజార్‌: టీఎస్‌ఆర్టీసీ కార్గో అండ్‌ పార్సిల్‌ సర్వీసుకు విశేష ఆదరణ లభిస్తున్నది. కార్గో సేవలు ప్రారంభమైన జూన్‌ నుంచి ఈ నెల 4వ తేదీనాటికి 6.5 లక్షల పార్సిళ్లను ఆర్టీసీ చేరవేసింది. రాష్ట్రవ్యాప్తంగా 147 బస్టాండ్లలో కార్గో సేవలు అందుబాటులో ఉంచటం వల్ల.. ఒక్క ఆగస్టులోనే సంస్థకు రూ.2.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు సెంటర్లలోనే సేవలు కొనసాగుతుండగా, త్వరలోనే ఇంటివద్దకే వచ్చి సరుకు తీసుకోవడం, డెలివరీ చేయడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, కార్గో అండ్‌ పార్శిల్‌ సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు పండించిన పంటలను తమ పొలం నుంచి మిల్లు వరకు, అక్కడి నుంచి మార్కెట్‌కు లారీల కంటే తక్కువ ధరకే చేరవేసేందుకు అధికారులు ధరలను రూపొందించారు.


logo