మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 12:39:39

మహిళా సాధికారతకు సమాజంలో మార్పు రావాలి: వెంకయ్య నాయుడు

మహిళా సాధికారతకు సమాజంలో మార్పు రావాలి: వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌ : మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. మహిళలు సృష్టిలో సగభాగం. స్త్రీ లేకపోతే సృష్టే లేదన్నారు. మంచిచేసిన వాళ్లను గుర్తుపెట్టుకుని సత్కరించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అన్ని శాఖలను మనవాళ్లు మహిళలకు కేటాయించారు. ఆర్థికశాఖ మంత్రి లక్ష్మీదేవి, రక్షణశాఖ మంత్రి పార్వతిదేవీ, విద్యాశాఖ మంత్రి సరస్వతిదేవీ ఇలా ప్రతీది. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు ప్రతీరంగంలోనూ రాణిస్తారన్నారు. ప్రతీ తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను పాఠశాలకు పంపాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దేశాభివృద్ధికి మహిళా సాధికరత ఎంతో ముఖ్యమన్నారు. మహిళా సాధికారతలో మంచి పురోభివృద్ధి సాధిస్తున్నాం. అయినా ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. మహిళా సాధికారత అనే విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. దీని కోసం ముందు సమాజంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు.logo
>>>>>>