Telangana
- Jan 06, 2021 , 17:55:34
మహిళా ఉద్యోగులకు శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్తను అందించింది. గర్భిణీ ఉద్యోగులు కాలేజీకి వెళ్లకుండా ఇంటినుంచే విధులు నిర్వర్తించవచ్చు. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ గర్భిణీ ఉద్యోగులు ఇంటినుంచే తమ విధులు నిర్వర్తించడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గర్భిణీ ఉద్యోగులు కొవిడ్ నేపథ్యంలో కాలేజీలకు వెళ్లడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, మహిళా ఉద్యోగులు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణీ ఉద్యోగుల ఈ సమస్యను పరిశీలించాల్సిందిగా ఇంటర్ విద్యా కమిషనర్‌కు ప్రతిపాదించడంతో ఇంటర్ విద్య కమిషనర్ మహిళా ఉద్యోగులు కాలేజీకి రాకుండానే ఇంటినుంచి విధులు నిర్వర్తించేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
అభివృద్ధిని చూసి ఊరు కదిలింది
ఆరు నూరైనా కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం : మంత్రి ఎర్రబెల్లి
వెలమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
కిడ్నాప్ కేసులో ఏ2గా భూమా అఖిలప్రియ
తాజావార్తలు
MOST READ
TRENDING