గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 24, 2020 , 00:56:23

హెల్త్‌హబ్‌గా హైదరాబాద్‌

హెల్త్‌హబ్‌గా హైదరాబాద్‌
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

కొండాపూర్‌/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మెడికల్‌ అండ్‌ హెల్త్‌ హబ్‌గా హైదరాబాద్‌ నగరం ఇప్పుడు మారుతున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  గురువారం మాదాపూర్‌లోని మెడికోవర్‌ దవాఖానలో రోబోటిక్‌ అసిస్టెంట్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌, అత్యాధునిక ఆర్థోపెడిక్‌ చికిత్స కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ సేవలను అందించేందుకు ప్రైవేట్‌ దవాఖానలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేరే రోగులకు కార్పొరేట్‌ దవాఖానల్లో మానవీయకోణంలో వైద్యాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. 


ఫెర్టిలిటీ సమస్య అధికమవుతున్నది.

పలు కారణాలతో మహిళల్లో ఫెర్టిలిటీ సమస్య అధికమవుతున్నదని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి, గైనకాలజీపై హెచ్‌ఐసీసీలో సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సంతోషం కొరవడిందని.. రాత్రి పగలు అనే తేడాలేకుండా ఒత్తిడిలో బతుకుతున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కపిల్‌రాజ్‌, కొండాపూర్‌ కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌, మెడికోవర్‌ ఎండీ అనిల్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
logo