గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 15:25:20

రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే బాధపడే రోజులు పోయాయి

రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే బాధపడే రోజులు పోయాయి

వరంగల్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు  చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే బాధపడే రోజులు పోయాయని అన్నారు.

 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమల పంతులు, జడ్పీటీసీ బానోత్ సింగ్ లాల్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.


logo