గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:23:45

గోండు గూడేల్లో దండారీ సంబురాలు..వీడియో..

గోండు గూడేల్లో దండారీ సంబురాలు..వీడియో..

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా రాజ గోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యే సరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోడ్చి చేసిన కష్టం ధాన్యం లక్ష్మిగా నట్టింట చేరి వుంటుంది.గోండులందరూ ఆట పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమౌతాయి.గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో.. గుస్సాడీ నృత్యం ఒక భాగం. దీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం ప్రత్యేకం. గోండుల సంప్రదాయ నృత్యాలను ఈ కింది వీడియోలో మీరూ చూసేయండి. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.