శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 21:41:08

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ రాబోతుంది. భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు  ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు. 2021కల్లా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, దీనిపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo