మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:40:09

ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శర్మకు స్వర్ణ జయంతి ఫెలోషిప్‌

ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌  చంద్రశేఖర్‌ శర్మకు స్వర్ణ జయంతి ఫెలోషిప్‌

సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ శర్మ ప్రతిష్ఠాత్మక స్వర్ణ జయంతి ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. 2019-20 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 21 మంది ప్రముఖ పరిశోధకుల్లో చంద్రశేఖర్‌ కూడా ఉన్నారు. ఈ ఫెలోషిప్‌ను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ప్రతీ సంవత్సరం అందజేస్తుంది. తనకు ఫెలోషిప్‌ లభించడంపై చంద్రశేఖర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తనకు సహకరించినందుకు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, మాజీ డైరెక్టర్‌ యూబీ దేశాయ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.