గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 17:46:14

రూ. 3.5 ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

రూ. 3.5 ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

రంగారెడ్డి : అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన బంగారాన్ని అధికారులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న శంషాబాద్ విమానాశ్ర‌యంలో నేడు చోటుచేసుకుంది. ప్ర‌యాణికుల రోజువారీ త‌నిఖీల్లో భాగంగా క‌స్ట‌మ్స్ అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా దుబాయ్‌-హైద‌రాబాద్ విమానంలో వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద అధికారులు అక్ర‌మ బంగారాన్ని గుర్తించారు. నిందితుడు 74 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో రిస్ట్ వాచ్‌లో పెట్టుకుని తీసుకువ‌చ్చాడు. బంగారాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకుని వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ సుమారు రూ. 3.5 ల‌క్ష‌లుగా స‌మాచారం. 


logo