సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 12:40:53

వరదలో కొట్టుకుపోయిన బంగారం లభ్యం

వరదలో కొట్టుకుపోయిన బంగారం లభ్యం

హైదరాబాద్‌ : ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా వరదలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం నగల సంచి ఎట్టకేలకు లభ్యమైంది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లో ఓ దుకాణం నుంచి మరో దుకానికి బంగారం తరలిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. ఓ కొనుగోలుదారుడి కోసం కిలోన్నర బంగారు ఆభరణాలను పంపాలన్న కోరికపై బషీర్‌బాగ్‌లోని వీఎస్ గోల్డ్ షాపు యజమాని, జూబ్లీహిల్స్‌లోని కృష్ణ పెరల్స్‌కు ఆ మొత్తం నగలను సేల్స్‌మన్ ఇచ్చి పంపాడు. ద్విచక్ర వాహనంపై నగలు తీసుకొని బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-3 మీదుగా బయలుదేరాడు. ఈ క్రమంలో కిడ్స్ స్కూల్‌ వద్ద వర్షానికి వరద రావడంతో అందులో ఆభరణాల సంచి కొట్టుకుపోయింది. సేల్స్‌మెన్‌ వెంటనే దుకాణ యజమానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. 15 మంది అక్కడికి చేరుకొని రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా దొరకలేదు. ఈ క్రమంలో మళ్లీ మంగళవారం ఉదయం స్థలంలో వెతకగా.. మంగళవారం సంచిని కనుగొన్నారు. అలాగే ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులు సేల్స్‌మెన్‌ అదుపులోకి విచారణ జరుపుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo