ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 23:07:27

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ : రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా తరలించేందుకు యత్నించిన రూ.17.48 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6ఈ 6468 విమానంలో చెన్నైకి  వెళ్లేందుకు బుధవారం ఓ ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చాడు. అతడిపై అనుమానం రావడంతో  డీబోర్డు చేసి కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌ పరిశీలించగా లోపల చుట్టూ బంగారం తీగలు చుట్టి ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. 22 క్యారెట్ల స్వచ్ఛమైన 340.16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ ప్రయాణికుడు ఇతడికి ఓ ట్రాలీ బ్యాగ్‌ అప్పగించినట్లు గుర్తించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo