ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 02:37:59

గర్భాలయ ద్వారానికి స్వర్ణసొబగులు

గర్భాలయ ద్వారానికి స్వర్ణసొబగులు

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రి ప్రధానాలయ గర్భగుడి ద్వారం స్వర్ణమయం కానున్నది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు అధికార యంత్రాంగం పనులను వేగవంతం చేసింది. ఆగమశాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ టేకు ద్వారానికి రాగి, కాస్యంతో ఎంబాజింగ్‌ పనులు చేపట్టారు. ద్వారం దిగువ భాగంలో 6 బంగారు బాతులను, వాటి మధ్య 36 తామర పుష్పాలను తీర్చిదిద్దనున్నారు. ఆకట్టుకునేలా 14 లక్ష్మీనరసింహ విగ్రహాలను అమర్చనున్నారు. ద్వారం తీయగానే 36 గంటలు శ్రీచక్ర నామాన్ని జపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 16 కిలోల బంగారాన్ని వినియోగించి ద్వారానికి స్వర్ణ తాపడం చేయనున్నారు. శుక్రవారం వైటీడీఏ అధికారులు స్వర్ణ ద్వారానికి సంబంధించిన గ్రాఫిక్‌ వీడియోను విడుదల చేశారు. 

తాజావార్తలు


logo