గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 01:18:09

ఇది బెల్టు కాదు.. బంగారం

ఇది బెల్టు కాదు.. బంగారం

శంషాబాద్‌, జనవరి15: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం 395.07 గ్రాముల రూ. 19.90 లక్షల విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు 6ఇ 025 విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అనుమానంతో అతన్ని తనిఖీ చేశారు. ప్యాంట్‌కు ప్రత్యేకంగా బెల్టు మాదిరి జేబు కుట్టించుకొని అందులో పౌడర్‌గా మార్చిన బంగారాన్ని దాచినట్టు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. 

VIDEOS

logo