సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 17:10:58

ఆరు నెలల తర్వాత తెరుచుకున్న గోల్కొండ కోట

ఆరు నెలల తర్వాత తెరుచుకున్న గోల్కొండ కోట

హైదరాబాద్‌ : గోల్కొండ కోట గురువారం తెరుచుకుంది. కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో మూతపడ్డ కోటలోకి మళ్లీ పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అలాగే మాస్క్‌లు ఉంటేనే లోనికి పంపిస్తున్నారు. మరోవైపు గోల్కొండ కోటకు పర్యాటకులు వస్తుండటంతో సందడి మొదలైంది. కరోనా ప్రభావంతో గత మార్చిలో పర్యాటక ప్రదేశాన్ని అధికారులు మూసివేశారు. దాదాపు ఆరు నెలలుగా మూతపడిన కోటను సందర్శించడానికి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo