గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:40

చావు అంచుల వరకు వెళ్లిన: ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌

చావు అంచుల వరకు వెళ్లిన: ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌

  •  ప్రభుత్వ వైద్యంతోనే కోలుకున్న

హుజూరాబాద్‌: ‘కరోనా పాజిటివ్‌తో చావు చివరి అంచుల వరకు పోయి వచ్చా.. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడం వల్లే తిరిగి ప్రజల మధ్యకు రాగలిగా’ అని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఆయన ఉద్వేగంతో మాట్లాడారు. తనకు కొవిడ్‌ సోకిందని తెలియగానే మంత్రి ఈటల రాజేందర్‌ తనను సొంత తమ్ముడిలా భావించి నిత్యం ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే బతికి బట్టకట్టానని తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే కొంత తక్కువ ప్రమాదం వరకు వెళ్లానని చెప్పారు. కరోనా కొంత భయపెట్టినా రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు చర్యలతో ఎదుర్కోగలిగానని ధీమాగా తెలిపారు.