శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 12:35:24

కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..

కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు షురూ..

పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రముఖ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న నందిమేడారంలోని ఆరో ప్యాకేజీ నంది పంప్ హౌస్‌లోని నాలుగు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంప్‌హౌస్‌ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో ఒక్కో మోటారు ద్వారా 3,150 క్యూసెక్కుల నీళ్లు నంది రిజర్వాయర్లోకి వెళ్తున్నాయి. నంది రిజర్వాయర్ నుంచి ఏడో ప్యాకేజి ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురంలోని గాయత్రి పంప్ హౌస్‌కు చేరుకుని, అక్కడి నుంచి మిడ్‌మానేరుకు తరలి వెళ్తాయని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఎత్తిపోతలను ఈఎన్‌సీ నల్ల వెంటకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు.


VIDEOS

logo