బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 16:19:05

భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరుగుతున్న గోదావ‌రి నీటిమ‌ట్టం

భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరుగుతున్న గోదావ‌రి నీటిమ‌ట్టం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటి మ‌ట్టం క్ర‌మంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావ‌రికి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌లకు గోదావ‌రి నీటిమ‌ట్టం 35.7 అడుగుల వ‌ద్ద ఉండ‌గా, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు 37.7 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరింది. సాయంత్రం వ‌ర‌కు భ‌ద్రాచ‌లం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేసే అవ‌కాశం ఉంది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo