e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home News ముగిసిన గోదావరి బోర్డు ఉపసంఘం సమావేశం

ముగిసిన గోదావరి బోర్డు ఉపసంఘం సమావేశం

హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధాలో బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ అమలుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రతా తదితర అంశాలపై చర్చించారు. కాగా, గోదావరిపై ఉన్న అనుమతిలేని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల రోజుల్లోగా అందజేయాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.

ఇక.. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జలసౌధాలో జరుగుతున్న గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణ ఖరారుపై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో గోదావరి బోర్డు సభ్యులు, అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. కృష్ణాబోర్డు సభ్యుడు ఆర్‌కే పిళ్లై కన్వీనర్‌గా ఉపసంఘం ఏర్పాటయింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement