శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 12:13:10

కాళేశ్వ‌రంలో పూజ‌లు, పుణ్య‌స్నానాలు నిలిపివేత‌

కాళేశ్వ‌రంలో పూజ‌లు, పుణ్య‌స్నానాలు నిలిపివేత‌

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : కాళేశ్వ‌రం త్రివేణి సంగ‌మం వ‌ద్ద గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. మ‌హారాష్ర్ట‌లో కురుస్తున్న వ‌ర్షాల‌తో ప్రాణ‌హిత ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. కాళేశ్వ‌రం పుష్క‌ర్ ఘాట్ వ‌ద్ద మెట్లు నీట మునిగాయి. గోదావ‌రి, ప్రాణ‌హిత న‌దులు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక స్థాయి దాటి ప్ర‌వ‌హిస్తున్నాయి. త్రివేణి సంగ‌మం ఘాట్ వ‌ద్ద 12.270 మీట‌ర్ల మేర గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. గోదావ‌రి వ‌ర‌ద ఉధృతితో కాళేశ్వ‌రంలో పూజ‌లు, పుణ్య‌స్నానాలు నిలిపివేశారు. తీర ప్రాంతంలోకి ప్ర‌జ‌ల‌ను, భ‌క్తుల‌ను రానివ్వ‌కుండా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. 


logo