శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 07:50:47

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం : గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం అధికమవడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమం పెరుగుతోంది.  మంగళవారం సాయంత్రానికి 37.7 అడుగులకు చేరిన నీటిమట్టం గురువారం ఉదయానికి 42.3 అడుగులకు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. దీంతో స్థానిక అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo