బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 12:14:59

ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం జలసౌధాలో ప్రారంభమైంది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రధాన కార్శదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఇరు రాష్ర్టాల్లో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, టెలిమెట్రీ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా గోదావరి బోర్డుకు నిధుల కేటాయింపు విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 

గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టులతోపాటు రామప్ప నుంచి పాకాల వరకు నీటి తరలింపు విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. 


logo