శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 02:02:53

గోదావరి పరవళ్లు కొనసాగుతున్న ఎత్తిపోతలు

 గోదావరి పరవళ్లు కొనసాగుతున్న ఎత్తిపోతలు

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/మహదేవపూర్‌: ఎగువకు గోదావరి పరవళ్లుతొక్కుతున్నది. కాళేశ్వరం లింక్‌1, 2ల్లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీపంప్‌హౌజ్‌లో 3 మోటర్ల ద్వా రా 6,300 క్యూసెక్కుల నీరు సరస్వతీ బరాజ్‌లోకి వెళ్తున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంప్‌హౌజ్‌లో ఆదివారం 1, 3, 7 మోటర్ల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతిబరాజ్‌లోకి.. గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్‌లోని 3, 5, 6 మోటర్ల ద్వారా 7,830 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నా రు. లింక్‌-2లో భాగంగా ధర్మా రం మండలం నంది మేడారంలోని నందిపంప్‌హౌజ్‌లో 3, 4 మోటర్ల ద్వారా 6,300 క్యూసెక్కుల జలాలు నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. ఇక్కడినుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌజ్‌కు చేరుతున్నాయి. ఇక్కడ 2, 4 పంపుల ద్వారా 6,300 క్యూసెక్కుల నీరు ఎస్సారార్‌కు వెళ్తుంది. ప్రస్తుతం ఈ జలాశయంలో 25.297 టీఎంసీల నీరు ఉన్నది. ఎల్‌ఎండీకి 7,997 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో, 5,832 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.219 టీఎంసీలు నిల్వ ఉన్నది.
logo