గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Aug 16, 2020 , 08:30:20

ఉగ్ర గోదావరి.. భద్రాచలంలో ఆలయం మెట్ల వరకు చేరిన వరద

ఉగ్ర గోదావరి.. భద్రాచలంలో ఆలయం మెట్ల వరకు చేరిన వరద

హైదరాబాద్‌ : రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. నదిలో క్రమక్రమంగా నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. ప్రస్తుతం నీటిమట్టం 48.7 అడుగులకు చేరగా, రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. భారీ వరదకు భద్రాచలం వద్ద శ్రీరాముడి ఆలయ అన్నదాన సత్రంలోకి నీరు చేరింది. రామాలయం మెట్ల పైకి వరద వచ్చింది. ఆలయానికి చెందిన కల్యాణ కట్ట, స్నాన  ఘట్టాలు నీట మునిగాయి. గోదావరి ఉధృతికి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపూర్‌ వద్ద రహదారిపైకి నీరు చేరాయి. నీటి రాకతో నిలిచిపోయిన దుమ్ముగూడెంకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం, చెర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo