బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 24, 2020 , 18:06:50

మంత్రులను ఆశీర్వదించిన గోదారమ్మ... వీడియో

మంత్రులను ఆశీర్వదించిన గోదారమ్మ... వీడియో

సిద్దిపేట: రైతుల మొహాల్లో ఆనందం చూడాలని, బీడువారిన భూములను సాగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సీఎం ఆశయం ఒక్కొక్కటిగా ఫలిస్తున్నది. సిద్దిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే రంగనాయక సాగర్‌ ప్రాజెక్టును నింపే మోటర్లు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసింది. తొలుత రంగనాయక స్వామి ఆలయంలో పూజలు చేసిన మంత్రులు ప్రాజెక్టువద్దకు చేరుకుని మోటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా పైపుల నుంచి వచ్చిన గోదారమ్మ తల్లి మంత్రులను ఆశీర్వదిస్తున్నట్లుగా వారిపై ఎగిసి పడింది. దీంతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పులకించి పోయారు. దానికి సంబంధించిన వీడియోను చూడండి..   logo