మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 08:13:56

అందాల పోటీలో హోయ‌లు పోతున్న మేక‌పోతు

అందాల పోటీలో హోయ‌లు పోతున్న మేక‌పోతు

నర్సంపేట : వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో సంక్రాంతి సంబురాల సందర్భంగా శాంతిసేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం మూగజీవాలకు అందాల పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల్లో ఓ మేక‌పోతు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.   


ఈ అందాల పోటీలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కోళ్లు, గొర్రెలు, మేకలు, బర్రెలు, ఎద్దులు, లేగ దూడలు, కుక్కలు, పాడి గేదెలు.. ఇలా మొత్తం 625 మూగ జీవులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. వెయ్యి మంది రైతులు తమ పశువులను పోటీకి తీసుకొచ్చారు. జోడెడ్లు, ఆవు, పాడి గేదెలు, లేగ దూడలు, గొర్రె పొట్టేలు, మేక పొట్టేలు, కుక్క‌లు తదితర విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతుల కింద‌ రూ. 5116, రూ. 3116, రూ. 2116, రూ.1116, రూ. 516, రూ. 316, రూ.116లను అందించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. 


logo