శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 18:05:44

దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాటం చేయండి : మంత్రి గంగుల

దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాటం చేయండి : మంత్రి గంగుల

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాటం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్ అన్నారు.  హైదరాబాద్ లో పోరాటం చేస్తే ఏం లాభం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా పోతిరెడ్డిపాడు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకు పోయి పరిష్కరించాలన్నారు. 2009లో నేను మహారాష్ట్ర వెళ్లి బాబ్లీపై పోరాటం చేశానని, అక్కడి పోలీసులతో దెబ్బలు తినడమే కాకుండా నాపై కేసులు పెట్టిన విషయం మర్చిపోవద్దన్నారు. ఈ విషయాలను వదిలి రాజకీయం కోసం రాష్ర్టంలో ఆందోళన చేయడం ఏంటని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో  సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారని ఎంత వరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. 

అలాగే రాష్ట్రంలో 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఇంకా కొనుగోళ్లు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 60 రోజుల్లో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామంటే ఎంత త్వరగా కొనుగోళ్లు జరుపుతున్నామో అర్థం చేసుకో వచ్చన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సాగు చేస్తే రైతులు బాగుపడతారని మంత్రి సూచించారు.


logo