గురువారం 09 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 23:22:58

కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి సహాయంకు సంబంధించిన జీవో జారీ

కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి సహాయంకు సంబంధించిన జీవో జారీ

హైదరాబాద్‌: ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యపేట వెళ్లి కల్నల్‌ సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. అనంతరం సంతోష్‌ భార్య సంతోషికి గ్రూప్‌ 1 ఉద్యోగం, 711 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు సంబంధిత పత్రాలు అందజేశారు. దానికి సంబందించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లో టౌన్‌ సర్వే నెంబర్‌ 6/1, బ్లాక్‌ ఈ వార్డు నెంబర్‌ 10లో 771 గజాల ఇంటి స్థలం కేటాయించింది. లేట్‌ సంతోష్‌ కుమార్‌ భార్య సంతోషికి కారుణ్య నియామకం ద్వారా గ్రూప్‌ 1పోస్టు కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా రూల్‌ నెంబర్‌ 31, ఎస్‌ఎస్‌ రూల్‌, 1996 నిబంధనల ప్రకారం ఉద్యోగం కల్పించింది. 


logo