మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 15, 2021 , 20:33:13

ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..

ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..

మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ధరణి పథకం విశేష ప్రజాధరణ పొందుతున్నది. భూ సమస్యలు తలెత్తకుండా చేపట్టిన ఈ వినూత్న పథకం పని తీరు ప్రశంసలను పొందుతున్నది. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన కాని పని ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చి భూములను రిజిస్ట్రేషన్ చేస్తుండటం పథకం పనితీరుకు అద్దం పడుతున్నది. జిల్లా కోట‌ప‌ల్లి మండ‌లం నక్కలప‌ల్లి గ్రామానికి చెందిన ర‌త్న రాజిరెడ్డి త‌న 16 గుంట‌ల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన శ్రావ‌ణ్ రెడ్డికి విక్రయించాడు.

కాగా, రాజిరెడ్డి అనారోగ్యానికి గురై త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. దీంతో త‌హ‌సీల్దార్ రామచంద్రయ్య ధర‌ణి ఆప‌రేట‌ర్ తిరుప‌తితో  కలిసి భూమిని అమ్మిన రైతు ఇంటికి వెళ్లారు. ఆ రైతు సంత‌కం, ఇత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేసుకొని త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి వ‌చ్చి ఆన్‌లైన్ చేశారు. అనంత‌రం నక్కలపల్లి గ్రామానికి వెళ్లి అధికారులు భూమిని కొనుగోలు చేసిన రైతుకు ప‌ట్టా పాసు పుస్తకం అందజేశారు. అధికారుల పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం 

VIDEOS

logo