గురువారం 16 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 00:11:33

జీఎమ్మార్‌లో జీతాల కోతలు

జీఎమ్మార్‌లో జీతాల కోతలు

  • కరోనా నేపథ్యంలో 50 శాతం వరకు తగ్గించిన సంస్థ

ముంబై, జూన్‌ 2: కరోనా వైరస్‌ ప్రభావంతో జీఎమ్మార్‌ గ్రూప్‌ తమ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వరకు కోత విధించింది. మే నుంచే ఈ తగ్గింపులు అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఉన్నతస్థాయి ఉద్యోగుల వేతనాలు గరిష్ఠంగా తగ్గుతాయని స్పష్టం చేశాయి. ‘ఉద్యోగుల జీతాలను పునర్‌వ్యవస్థీకరిస్తున్నాం’ అని ఓ ఈ-మెయిల్‌ ప్రశ్నకు జీఎమ్మార్‌ గ్రూప్‌ అధికార ప్రతినిధి ఒకరు సమాధానమిచ్చారు. ‘వ్యాపార, పారిశ్రామిక రంగాలు, ముఖ్యంగా మౌలిక రంగం ఎదుర్కొంటున్న కరోనా సవాళ్ల దృష్ట్యా ఉద్యోగుల వేతనాల సవరణకు దిగాల్సి వచ్చింది’ అని ఆ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార ప్రదర్శనకు అనుసంధానంగా ఓ స్పెషల్‌ వేరియబుల్‌ కాంపొనెంట్‌ను పరిచయం చేశామని వివరించారు. రోడ్లు, జాతీయ రహదారులు, విద్యుత్‌ ఉత్పత్తి, విమానాశ్రయాల నిర్వహణ రంగాల్లో జీఎమ్మార్‌ గ్రూప్‌ కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.


logo