బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 11:26:49

నిషేధిత గ్లైఫోసైట్‌ గడ్డి మందు స్వాధీనం

నిషేధిత గ్లైఫోసైట్‌ గడ్డి మందు స్వాధీనం

మంచిర్యాల : జిల్లాలోని దేవాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తుంగగూడలో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి నిషేధిత గ్లైఫోసైట్ గడ్డి మందు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ తనిఖీలు నిర్వహించి.. 75 లీటర్ల గ్లైఫోసైట్ గడ్డిమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మేకల మహేశ్‌ ఈ గడ్డిమందును మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకొచ్చి.. రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గడ్డి మందు విలువ సుమారు రూ. 60 వేలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని దేవాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ టీ కిరణ్‌, ఎస్‌ఐ సీహెచ్‌ కిరణ్‌, సిబ్బంది ఓంకార్‌, వెంకటేశ్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.


logo