బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 08:52:57

ముక్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలు

ముక్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోజాగిరి పౌర్ణమి వేడుకలు

కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి  కోజాగిరి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు చేపట్టిన భజన కార్యక్రమాలు అలరించాయి. అనంతరం కౌముది పూజ చేసి భక్తులు పాలలో  చంద్రుని దర్శనం చేసుకున్నారు. భక్తులకు స్వామివారి ఆశీస్సులతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు, మాజీ ఆలయం ధర్మకర్తలు పాల్గొన్నారు.

 నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు..

పౌర్ణమి సందర్భంగా శనివారం  ముక్తేశ్వరస్వామికి ఉదయం 7 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం చేశారు. 10 గంటల 30 నిమిషాలకు స్వామివారి నిత్య కళ్యాణం జరిపిస్తారు. 12 గంటల 45 నిమిషాలకు నైవేద్యం సమర్పించి అభిషేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు ఆలయం మూసివేసి సాయంత్రం 4 గంటలకు తిరిగి తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు అభిషేకాలు, పూజలతోపాటు భక్తుల దర్శనాలు కొనసాగుతాయి. 9 గంటల తరువాత భజన కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆలయం మూసి వేస్తారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.