సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 08:24:36

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వండి: మంత్రి హరీష్‌

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వండి: మంత్రి హరీష్‌

సిద్దిపేట: తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు సూచించారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మార్నింగ్‌వాక్‌ చేసి, అనంతరం.. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ కలియదిరుగుతూ చెత్త సేకరణ, వేరుచేయడం లాంటి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలను వేరుచేసి.. శానిటేషన్‌ సిబ్బందికి అందించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెత్త బుట్టలను సక్రమంగా వినియోగించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడి, పొడి చెత్తలను ఒకే బుట్టలో వేయరాదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఉన్నారు. 


logo