కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని జూట్ మిల్లులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముడి సరుకు లేమి, ఉద్యోగులు, కార్మికుల కొరతతోపాటు కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దీనికి ఒక కారణం. ఫలితంగా రాష్ట్రంలోని 16 జూట్ మిల్లులు మూత పడ్డాయి. తత్ఫలితంగా సుమారు 50 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
16 జూట్ మిల్లుల్లో ఐదు గత నాలుగు రోజులుగా ముడి సరుకు సంక్షోభం వల్ల మూత పడి ఉన్నాయి. ఇదే కారణం వల్ల వచ్చే కొన్ని రోజుల్లో మరో 10 మిల్లుల మూత పడే అవకాశం ఉందని ఇండియన్ జూట్ మిల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమబెంగాల్లో 60కి పైగా జూట్ మిల్లులు పని చేస్తున్నాయి. సుమారు 2.5 లక్షల మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. జ్యూట్ బ్యాగులను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన చెల్లింపులు జాప్యం చేయడం కూడా జూట్ మిల్లులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి మరో కారణం.
తమ ఉత్పత్తుల విక్రయానికి అనుగుణంగా డబ్బు చెల్లింపులు జరుగక పోతే జూట్ మిల్లుల యాజమాన్యాలు తమ కార్మికులకు వేతనాలను చెల్లించడానికి విపత్కర పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ వేళ 30 శాతం సిబ్బందిని మాత్రమే సర్కార్ అనుమతినిస్తున్నది.
కానీ తమ రంగం భవితవ్యం ద్రుష్ట్యా 30 శాతం నిబంధనను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జూట్ మిల్లుల యాజమాన్యాలు, కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కోసం జూన్ నుంచి నవంబర్ మధ్య బెంగాల్ జూట్ మిల్లులు 14 లక్షల బేళ్ల జ్యూట్ బ్యాగులను సరఫరా చేయాల్సి ఉంది.
ఈ ఏడాది కూడా గోధుమల దిగుబడి పెరుగనున్నది. కరోనా లాక్డౌన్ వేళ ప్రతి షిప్ట్‌కు 30 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతించడం.. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గన్నీ బ్యాగుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేమని తెలుస్తున్నది. ఇప్పటికే రెండు లక్షల బేళ్ల బ్యాగ్‌లను సరఫరా చేయాలన్న ఒప్పందం అమలు కాలేదు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!