శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 14:39:09

ఏ పత్రాలు వద్దు..సరైన సమాచారం ఇస్తే చాలు

ఏ పత్రాలు వద్దు..సరైన సమాచారం ఇస్తే చాలు

ఖమ్మం : జిల్లాలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న అస్సెస్మెంట్ సర్వేను  కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇంటి వద్దకు వచ్చిన అధికారులకు వివరాలను మాత్రమే తెలియజేస్తే సరిపోతుందన్నారు. పత్రాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. 

ప్రజల్లో ఎలాంటి అపోహలను సృష్టించకుండా అన్ని వర్గాల ప్రజలు రెవెన్యూ చట్టానికి అనుగుణంగా ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఇంటి వద్దకు వచ్చిన అధికారులకు తగిన సమాచారాన్ని అందించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. అధికారులు ఓపికతో ప్రజల నుంచి వివరాలు సేకరించాల్సి అవసరం ఉందన్నారు. ఇంటికి సంబంధించిన అన్ని వివరాలను అధికారులకు తెలియజేస్తే పోర్టర్ లో నమోదు చేస్తారని ఆయన వివరించారు.


logo