శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:03:16

గిరిజన వర్సిటీకి అనుమతివ్వండి: మంత్రి సత్యవతి

గిరిజన వర్సిటీకి అనుమతివ్వండి: మంత్రి సత్యవతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌ముండాను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్‌ కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తమ రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు.  గిరిజన పరిశోధన సంస్థ, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ఇతర పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ గురువారం నిర్వహించిన నేషనల్‌ ట్రైబల్‌ రిసెర్చ్‌ కాంక్లేవ్‌ వీడియో కాన్ఫరెన్సులో సంక్షేమభవన్‌ నుంచి మంత్రి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  గిరి జన రిజర్వేషన్లు పెంచాలని కోరా రు.  వీ టితోపాటు కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు. సమావేశంలో గిరిజన సం క్షేమశాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, గిరిజనశాఖ ఏడీ సర్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

అసెంబ్లీ, కౌన్సిల్‌కు సమగ్ర సమాచారం : సీఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల ఏడోతేదీ నుంచి మొదలుకానున్న అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలకు అన్ని శాఖలు సమగ్ర సమాచారం తయారుచేయాలని కార్యదర్శులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం బీఆర్కేభవన్‌లో అన్నిశాఖల సెక్రటరీలతో ఆయ న సమీక్షించారు. శాసనమండలి, శాసనసభల్లోని పెండింగ్‌ ప్రశ్నలకు సమాధానాలు పంపాలని, మండలిలో సీనియర్‌ అధికారులు ఉండేలా చూడాలని చెప్పారు.  


logo