గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:23:00

ప్రశంసలే కాదు నిధులూ ఇవ్వండి

 ప్రశంసలే కాదు నిధులూ ఇవ్వండి

హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మిషన్‌భగీరథను ప్రశంసించడమే కాదు.. నిధులు కూడా ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర జల్‌ జీవన్‌ మిషన్‌ అధికారులు మిషన్‌భగీరథను పరిశీలించి అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉపాధి హామీకి రూ.135 కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


logo