శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 16:49:46

రైతుబంధు వద్దనుకునే వాళ్ల కోసం ‘గివ్ ఇట్ అప్‌’

రైతుబంధు వద్దనుకునే వాళ్ల కోసం ‘గివ్ ఇట్ అప్‌’

నారాయణపేట : రైతుబంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటున్న పట్టాదారులు తమ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ‘గివ్ ఇట్ అప్‌’ ఫారం ద్వారా వివరాలు పూర్తి చేసి ఇవ్వవచ్చని కలెక్టర్ డి. హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ పట్టాదారులు ఎవరైతే తమ రైతు బంధును వదులుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి గివ్ ఇట్ అప్ ద్వారా అవకాశాన్ని కల్పించారని తెలియజేసారు.

2020 యాసంగిలో పొందిన డబ్బులను సైతం గివ్ ఇట్ అప్  ఫచ్రాన్ని పూరించి చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వ్యవసాయ విస్తీర్ణాధికారిని గాని, మండల వ్యవసాయ అధికారికి అప్పగించాలన్నారు. వాటిని రైతు బంధు పోర్టల్ ద్వారా తెలంగాణా రైతుబంధు సమితికి వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ద్వారా పంపింనున్నట్లు ఆమె తెలిపారు. ప

ట్టాదారులు భవిష్యత్తులో తిరిగి రైతుబంధు కావాలని కోరుకున్నట్లయితే తిరిగి పొందే విధంగా పోర్టల్‌లో అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అందువల్ల ఎవరైనా పట్టాదారులు తమ రైతుబంధును వదులుకోవాలనుకుంటే ప్రభుత్వం కల్పించిన గివ్ ఇట్ అప్‌ను సద్వినియోగం చేసుకోవాలని హరిచందన కోరారు.

ఇవి కూడా చదవండి..

తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు : మంత్రి పువ్వాడ

వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు : మంత్రి వేముల

సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ కవిత


logo