సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 19:51:31

విదేశాల నుంచి వచ్చిన వారి గురించి సమాచారం ఇవ్వండి

విదేశాల నుంచి వచ్చిన వారి గురించి సమాచారం ఇవ్వండి

హైదరాబాద్‌: జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ, కమిషనర్‌, డీఎంహెచ్‌వోలతో కమిటీ వేశాం. మార్చి 1వ తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చిన వారి గురించి, ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారి గురించి 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ వాచ్‌ చాలా అవసరం. విదేశాల నుంచి వచ్చిన వారు మన మధ్య తిరిగితే వారి వ్యాధి మనకు అంటుకునే ప్రమాదం ఉంటుందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ కార్యదర్శులు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటిలోనే ఉండాలని ఫంక్షన్లు, జాతరలు, ప్రార్థనల కోసం ఒక దగ్గర గుమికూడవద్దని సూచించారు. నిన్న కరీంనగర్‌లో సభ ఏర్పాటు చేసిన వారి గురించి ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వారికి పరీక్షలు నిర్వహించిన తరువాతే రాష్ట్రంలోని అనుమతి ఇచ్చేవారని, అలాంటివి సభలు, సమావేశాలు ఏవైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo