సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 03:21:14

గీతం పాలకమండలిలో ఇద్దరు ప్రముఖులు

గీతం పాలకమండలిలో ఇద్దరు ప్రముఖులు

  • పద్మనాభయ్య, డాక్టర్‌ నాగేశ్వర్‌రావుకు చోటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గీతం యూనివర్సిటీ పాలకమండలి సభ్యులుగా కేంద్ర హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య, ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యశాల వ్యవస్థాపకుడు డాక్టర్‌ గుల్లపల్లి నాగేశ్వరరావు చేరారు. వారిని గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్‌ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా శ్రీభరత్‌ మాట్లాడుతూ.. గీతం లక్ష్యాన్ని సాధించడంలో విశేష అనుభవం గడించిన వీరి మార్గదర్శనం తోడ్పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో గీతం ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఎం గంగాధర్‌రావు, కార్యదర్శి బీవీ మోహన్‌రావు, సహాయ కార్యదర్శి ఎం భరద్వాజ్‌, కోశాధికారి బీఎస్‌ఎన్‌ఎల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. logo