బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:03:43

నీట్‌లో అమ్మాయిలు టాప్‌

నీట్‌లో అమ్మాయిలు టాప్‌
  • మెడికల్‌ పీజీ ర్యాంకులు విడుదల చేసిన కాళోజీ హెల్త్‌వర్సిటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మెడికల్‌ పీజీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో  అమ్మాయిలు సత్తాచాటారు. రాష్ట్రవ్యాప్తంగా 8,649 మంది నీట్‌కు హాజరుకాగా 4,933 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు శుక్రవారం కాళోజీ హెల్త్‌వర్సిటీ రాష్ట్రస్థాయి పీజీ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. జాతీయస్థాయిలో 49వ ర్యాంకు పొందిన ఎన్‌ శ్రీనిధి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్‌ సాధించారు. 1200 మార్కులకుగాను ఆమెకు 935 మార్కులు వచ్చాయి. 921 మార్కులతో సుప్రియ రెండో ర్యాంక్‌, 915 మార్కులతో కవిత మూడో ర్యాంకు సాధించారు. ఇవి ప్రాథమిక ర్యాంకులేనని.. ఇందులో ఎవరైనా నేషనల్‌కోటాలో సీటు తీసుకుంటే రాష్ట్ర స్థాయిర్యాంకులు మారతాయని అధికారులు చెప్పారు. logo