మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 17:13:46

టిస్ ఎంట్ర‌న్స్‌ను క్రాక్ చేసిన సోష‌ల్ వెల్ఫేర్ డిగ్రీ విద్యార్థినులు

టిస్ ఎంట్ర‌న్స్‌ను క్రాక్ చేసిన సోష‌ల్ వెల్ఫేర్ డిగ్రీ విద్యార్థినులు

హైద‌రాబాద్ : తెలంగాణలోని మారుమూల గ్రామీణ గ్రామాల నుండి వ‌చ్చి దేశంలోని టాప్ యూనివ‌ర్సిటీ ఎంట్ర‌న్స్ ను క్రాక్ చేశారీ విద్యార్థినులు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళల కోసం ఏర్పాటు చేసిన‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస డిగ్రీ కళాశాలలకు చెందిన‌ 13 మంది విద్యార్థినులు ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ఎస్) నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్త‌మ ప్ర‌తిభ చూప‌డంతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలలో కూడా రాణించారు.

టిస్‌లో ఎంఏ అడ్మిష‌న్ పొందిన విద్యార్థినుల వివ‌రాలిలా ఉన్నాయి. బి. సంధ్య‌(ఉమెన్ స్ట‌డీస్‌), కె.కృతుంగ‌(నేచుర‌ల్ రిసోర్సెస్ అండ్ గ‌వ‌ర్నెన్స్‌), రాచ‌ర్ల ర‌వ‌ళి(ప‌బ్లిక్ పాల‌సీ, గ‌వ‌ర్నెస్‌), ఎస్ చందూ ప్రియ దాస్(ఎడ్యూకేష‌న్‌), బి.అనూష‌(ఎడ్యూకేష‌న్‌), సీహెచ్ వ‌సంత‌(ఎడ్యూకేష‌న్‌), జే.దివ్య జ్యోతి(ఉమెన్ స్ట‌డీస్‌), జీ. వైష్ణ‌వి(సోష‌ల్ ఇన్నోవేష‌న్ అండ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌), బి. మౌనిక‌(ఎడ్యూకేష‌న్‌), జీ. అఖిల‌(నేచుర‌ల్ రిసోర్స్ అండ్ గ‌వ‌ర్నెన్స్‌), డి. న‌వ‌నీత‌(ఎడ్యూకేష‌న్‌), ఎల్‌.భ‌వానీ(ఉమెన్ స్ట‌డీస్‌), ఆర్‌.సాయికీర్త‌న‌(డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌), మ‌రో విద్యార్థి తెలంగాణ ట్రైబ‌ల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యూకేష‌నల్ ఇనిస్టిట్యూష‌న్ సొసైటీకి చెందిన‌ జి. శ్రీ‌కాంత్(ద‌ళిత్ అండ్ ట్రైబ‌ర్ స్ట‌డీస్‌)లో అడ్మిష‌న్ పొందారు. ‌

తెలంగాణ సామాజిక, గిరిజన సంక్షేమ విద్యా సంస్థల సంఘాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ... రాష్ర్టంలోని అట్ట‌డుగు మ‌హిళ‌ల కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా 45 సంక్షేమ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశార‌న్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ర్టం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌న్నారు.logo