బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 10:28:31

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలిక మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలిక మృతి

కొత్త‌గూడెం: అక్కాచెల్ల‌ళ్ల‌తో క‌లిసి పొలంకాడికి పోయిన బాలిక తిరిగిరానిలోకాల‌కు పోయింది. ఆట‌లో మునిగిన బాలిక ప్ర‌మాద‌వ‌శాత్తు పొలం ప‌క్క‌నే ఉన్న బావిలో ప‌డి మృతిచెందిన ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకున్న‌ది. 

కొత్త‌గూడెం మండ‌లం సీతంపేట బంజర గ్రామానికి చెందిన నునావత్ చిట్టిబాబు, రాజేశ్వరి దంప‌తుల కుమార్తె దీపిక (15). నిన్న త‌న పెద్ద‌నాన్న కూతుళ్ల‌తో క‌లిసి పోలవ‌ద్ద‌కు పోయింది. ఈ క్ర‌మంలో ప్రమాదవశాత్తు ప‌క్క‌నే ఉన్న బావిలో ప‌డింది. ఆమెతోవ‌చ్చిన వారు అది గ‌మ‌నించి కేక‌లు వేశారు. దీంతో స‌మీపంలో ఉన్న వ్య‌క్తులు వ‌చ్చి దీపిక‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే నీటిలో పూర్తిగా మునిగిపోవ‌డంతో ఆమె అప్ప‌టికే మ‌ర‌ణించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అయితే త‌న కూతురు మృతిపై ఎటువంటి అనుమానం లేదని దీపిక తండ్రి పోలీసులకు తెలిపారు.  


logo